![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 విజవంతంగా దూసుకుపోతుంది. రోజొక ట్విస్ట్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులకు విందు భోజనం అందిస్తున్నాడు. ఇక మొదటి వారం హౌస్ నుండి శ్రష్టివర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండవ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఒకరు సెలబ్రిటీ, ఒకరు కామనర్ .. ఇక మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.
ఈ వారం నామినేషన్ లో ఆరుగురు ఉండగా.. ఇమ్మ్యూనిటి పొందిన ఫ్లోరా నామినేషన్ నుండి సేవ్ అయింది. టాప్ లో రాము రాథోడ్ ఉన్నాడు.. సెకెండ్ ప్లేస్ లో రీతూ.. థర్డ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్.. ఫోర్త్ హరిత హరీష్.. చివరగా ప్రియా శెట్టి ఉన్నారు. లీస్ట్ లో ముగ్గురు కామనర్స్ ఉన్నారు ప్రియా శెట్టి ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఇద్దరు కామనర్స్ ఎలిమినేషన్ అవుతారు.
ఈ వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఇంకా ఒక సీక్రెట్ రూమ్ కి సంజన కూడా జరిగింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఒక కామనర్ ఎంట్రీ జరిగిందంటే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేది కామనర్స్ నుండే జరుగుతుంది. అందుకే బిగ్ బాస్ నుండి బిగ్ ట్విస్ట్ వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |